ఖమ్మంలో మున్నేరు వరద ఉధృతికి గురైన బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన 16500 వెంటనే వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీకాంత్ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఎం ఖమ్మం 3 టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరం మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు మరియు వరద బాధితులు పాల్గొన్నారు.