ఇల్లందు నియోజకవర్గం గార్ల మండలానికి బుధవారం నూతనంగా ఎస్సై ఎస్కే రియాజ్ పాషా బాధితులు స్వీకరించారు. ఇప్పటి వరకు గార్ల మండల బాధ్యతలు నిర్వహించిన ఎస్సై జీనత్ కుమార్ మహబూబాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. నూతన ఎస్సై రియాజ్ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు మండల ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలన్నారు.