సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను సూచించారు. ఇల్లెందు స్టేషన్ బస్తీలో నాకాబంధీ మంగళవారం నిర్వహించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సందేశాలను క్లిక్ చేయడం, వాటిని అనుసరించడం చేయవద్దని సూచించారు. గంజాయి, గుట్కా వంటి మాదకద్రవ్యాలను తీసుకుని యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలిపారు. ఇల్లెందు సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్సైలు నాగుల్ మీరా, సందీప్, సూర్య పాల్గొన్నారు.