రౌడీషీటర్లు గోడవలు చేయడం, సెటిల్ మెంట్లు దందాలకు పాల్పడితే గ్రామ బహిష్కరణ చేస్తామని డీఎస్పీ ఎన్. చంద్రభాను హెచ్చరించారు. స్థానిక పోలీసు స్టేషన్లో డీఎస్పీ రౌడీషీటర్లకు సోమవారం కౌన్సిలింగ్ ఇచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. సబ్డివిజన్లో నేరాలు చాలా తగ్గాయనీ, మద్యం మత్తులో జరిగిన సంఘటనలు తప్ప ఉద్దేశ్యపూర్వకంగా చేసినవి లేవని పేర్కొన్నారు.