టేకులపల్లి వాగులో కొట్టుకుపో తున్న ఓ యువకు స్థానికులు అప్రమత్తమై కాపాడారు. ఈ ఘటన టేకులపల్లి మండలంలో బుధవారం చోటుచేసుకుంది. సుజాతనగర్ చెందిన బానోత్ రవికిరణ్ బుధవారం తూర్పుగూడెం నుంచి స్వగ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. మధ్యలో లోలె వల్ వంతెనను దాటుతూ ప్రమాదవశాత్తు వాగులో జారిపడ్డాడు. ఇది గమనించి సమీప రైతులు కేకలు వేశారు. ఇది విని తూర్పు గూడెం తండాకు చెందిన వారు వాగులో దూకి రవి కిరణ్ను కాపాడారు.