టేకులపల్లి మండలంలో మాదక ద్రవ్యాలను గుర్తించే పోలీస్ జాగిలంతో మండలంలోని పాత గంజాయి నేరస్తులు, అనుమానితుల ఇళ్లల్లో, నిర్మానుష్య ప్రదేశాలలో సీఐ తాటిపాముల సురేశ్, ఎస్ఐ పోగుల సురేశ్, జాగిలం హ్యాండ్లర్ వెంకటేష్ గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. గంజాయి అమ్మి డబ్బు సంపాదించాలని చూసినా, గంజాయి సేవించినా కూడా చట్ట పరంగా కఠినమైన శిక్షలు తప్పవని సీఐ తెలిపారు.