ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య గార్ల మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామంలో శనివారం 10:30 నిమిషాలకు శ్రీ వేట వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం దుర్గాదేవి మండపం వద్దకు చేరుకొని పూజలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధనియాకుల రామారావు శుక్రవారం తెలిపారు.