డాక్టర్ బీ. ఆర్ అంబేడ్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. ఇల్లందు మార్కెట్ బిల్డింగ్ వర్కర్స్ అడ్డా వద్ద సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శ అబ్దుల్ నబి మాట్లాడుతూ దేశ రాజ్యాంగాన్ని నిర్మించి, ప్రజలకు దిక్సూచిలా ఉన్న అంబేడ్కర్ పై అనుచిత మాటలు సరికాదన్నారు.