ఇల్లందు మండల పరిధిలో మంగళవారం భారీ కుండపోత వర్షం కురిసింది. ప్రధాన రహదారి జలమయం అవడంతో రెండు గంటలసేపు రోడ్డుపై వెళ్లే వాహనాలు అక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. నైరుతి రుతుపవనాల వల్ల రెండు రోజులుగా ఉరుముల మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.