ఈడీ కస్టడీలో ఉన్న కవితను కలిసేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు సమయం నిర్ధారించింది. ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కలిసేందుకు న్యాయస్థానం అవకాశం కల్పించింది. భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌తో పాటు హరీశ్‌రావు, ప్రణీత్, న్యాయవాదులు కలిసే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రం కోర్టు నిర్దేశించిన సమయంలో కేటీఆర్, హరీశ్‌రావులు కలిసే అవకాశం ఉందని BRS నేతలు చెబుతున్నారు.