ఉచిత బస్సులపై మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. బస్సుల్లో సమయం వృధా ఎందుకని వెల్లుల్లి ఒలిచారని.. అదేమైనా తప్పా? అన్న మంత్రి సీతక్క వ్యాఖ్యలపై స్పందించారు. 'బస్సుల్లో అల్లం వెల్లుల్లి, కుట్లు అల్లికలు మేము వద్దనట్లేదు. బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు.. అవసరమైతే బ్రేకు డాన్సులు వేసుకోవచ్చు. బస్సుల్లో కొట్టుకుంటున్నారు. బస్సులు ఎక్కువ పెట్టండి, అవసరమైతే ఒక్కొక్కరికి ఒక్కో బస్సు పెట్టండి' అని అన్నారు.