లైంగిక దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ లేడీ డ్యాన్సర్ ప్రాణాలు పొగొట్టుకున్న ఘటన కోల్‌కతాలో వెలుగు చూసింది. కొందరు ఉన్మాదులు డ్యాన్సర్, ఈవెంట్ మేనేజర్ సుతాంద్రా ప్రయాణిస్తున్న కారును 10KM దాకా వెంబడించారు. కారులో గట్టిగా కేకలు వేస్తూ, బూతులు తిడుతూ ఛేజ్ చేశారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెతో పాటు ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యాయి.