దేశీయ మార్కెట్‌లోకి నయా యాక్టివా స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టెక్నాలజీ పరంగా భారీ మార్పులు చేసిన ఈ స్కూటర్‌లో సౌలభ్యంగా కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ షోరూంలో ఈ స్కూటర్ ధర రూ.80,950గా నిర్ణయించింది. బ్లూటూత్ కనెక్టివిటీతో 4.2 ఇంచుల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, నావిగేషన్, USB టైప్-సీ చార్జింగ్‌పోర్ట్ వంటి ఫీచర్స్‌తో ఈ స్కూటర్ లభించనున్నది.