ఒకరిపై ఒకరు గొడ్డలితో దాడి చేసుకున్న ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. భూ వివాదం నేపథ్యంలో తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో సోదరుల మధ్య ఘర్షణ చెలరేగడంతో అన్నదమ్ముల కుమారులు ఒకరినొకరు గొడ్డలితో నరుక్కున్నారు. ఈ దాడిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి విచారణ జరుపుతున్నారు.