ల్యాండర్, రోవర్ ఫొటోలు విడుదల చేసిన ISRO

69చూసినవారు
ల్యాండర్, రోవర్ ఫొటోలు విడుదల చేసిన ISRO
చంద్రయాన్‌-3 మిషన్‌లో భాగంగా గతేడాది ఆగస్టు 23న విక్రమ్‌ ల్యాండర్‌ జాబిలిలో విజయవంతంగా దిగి చరిత్ర సృష్టించింది. విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ చంద్రునిపై 14 రోజుల సేవ తర్వాత నిద్రాణస్థితిలోకి వెళ్లాయి. ఇటీవలే ల్యాండర్‌, రోవర్‌ను ఫోటో తీశామని ఇస్రో తెలిపింది. ఈ మేరకు వాటిని విడుదల చేశారు. మార్చి 15న దాదాపు 65 కిలోమీటర్ల దూరం నుంచి శాటిలైట్ సాయంతో ఈ చిత్రాలను తీశారని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్