త్వరలో స్కూల్ ఫీజుల నియంత్రణకు చట్టం

60చూసినవారు
త్వరలో స్కూల్ ఫీజుల నియంత్రణకు చట్టం
తెలంగాణలో ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురానున్నట్లు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం తెలిపారు. 2025-26లో ఈ చట్టం అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉందన్నారు. మరోవైపు విద్యా శాఖపై రేపు సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. జూన్ లో స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు, వీసీల నియామకాలు, ఇతర అంశాలపై సమీక్షించనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్