మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉన్నాయి: ట్రంప్

67చూసినవారు
మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉన్నాయి: ట్రంప్
పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉన్నాయని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు, తాజాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ 400 క్షిపణులతో దాడులు చేసిన ఘటనతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం పెరిగిపోయిందన్నారు. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మిడిల్ ఈస్ట్‌లో ఎలాంటి యుద్ధాలు జరగలేదని, ప్రస్తుత అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు అసమర్థులని, వాళ్లే యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్