వైసీపీ ఓట‌మికి కార‌ణం చెప్పిన మాజీ ఎమ్మెల్యే

78చూసినవారు
వైసీపీ ఓట‌మికి కార‌ణం చెప్పిన మాజీ ఎమ్మెల్యే
వైసీపీ 2024 ఎన్నిక‌ల్లో కేవ‌లం 11 సీట్లు మాత్ర‌మే సాధించి ఘోర ప‌రాజ‌యం పొందింది. దీంతో వైసీపీ ఓటమికి గల కారణాలు ఏమిటి అన్న చర్చ అయితే నాలుగు నెలలు అయినా కూడా ఈ రోజుకీ జోరుగా సాగుతోంది. అయితే వైసీపీ ఓటమి వెనక ఎన్నో కారణాలు ఉన్నాయని ధర్మవరానికి చెందిన ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అంటున్నారు. అంతేకాకుండా బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం వైసీపీకి లేక‌పోవ‌డంతో ఆ ప్ర‌భావం ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపించింద‌ని ఆయ‌న తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్