AP: అనంతపురం జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. కళ్యాణ దుర్గం కన్నెపల్లి రోడ్డులో రాజన్న అనే రైతు వ్యవసాయ పొలంలో శనివారం అర్థరాత్రి రెండు ఆవుదూడలపై చిరుత దాడి చేసి చంపేసింది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పొలాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుత దాడుల నుంచి తమను రక్షించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.