AP: నంద్యాల జిల్లా ఎస్.కొత్తూరు గ్రామంలో వందల ఏళ్లుగా ఓ ఆచారం కొనసాగుతూ వస్తోంది. ఈ గ్రామ ప్రజలు ఆదివారం వస్తే చాలు ఎంతో నియమనిష్ఠలతో ఉంటారు. ఎవరూ మాంసం తినరు. మద్యం సేవించరు. అలాగే గ్రామంలో ఎవరైనా మరణిస్తే.. ఆదివారం మాత్రం అంత్యక్రియలు చేయరు. ఆ మరుసటి రోజుల్లో చేస్తారు. ఈ గ్రామంలోని శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయ గర్భగుడికి పైకప్పు ఉండదు. అలాగే ఇవాళ్టి రోజు గ్రామస్థులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.