జీవితంలో సంతోషంగా ఉండాలనుకుంటే కొన్నింటి వదిలేయాలి. మీకు సూటవని విషయాల్ని పట్టించుకోకుండా వదిలేయడం మంచిది. కష్టమైన పనే అయినా మిమ్మల్ని తక్కువగా చూసేవారిని పట్టించుకోకపోవడం ఉత్తమం. జీవితంలో జరిగే ఏదో ఒక సంఘటనను పట్టుకుని అదే పనిగా ఆలోచించడం మానుకోవాలి. ముఖ్యంగా ఎదుటివారిపై ఈర్ష్య పడటం మానేయాలి. మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకోవడం అస్సలు మంచిది కాదు. ఇవన్ని వదిలిస్తేనే మీరు ప్రశాతంగా సంతోషంగా ఉండవచ్చు.