లిక్కర్ స్కాం మొత్తం రూ.600 కోట్లకు పైనే: ఈడీ

154340చూసినవారు
లిక్కర్ స్కాం మొత్తం రూ.600 కోట్లకు పైనే: ఈడీ
లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారుడని రోస్ ఎవెన్యూ కోర్టుకు ఈడీ తెలిపింది. కేజ్రీవాల్ కనుసన్నల్లోనే ఢిల్లీ మద్యం విధానానికి రూపకల్పన జరిగిందని ఈడీ తరఫు లాయర్ ఎస్వీ రాజు రోస్ ఎవెన్యూ కోర్టు దృష్టికి తెచ్చారు. ‘కిక్‌బ్యాక్‌లకు బదులుగా సౌత్ గ్రూప్ మద్యం వ్యాపారంపై పట్టు సాధించింది. ఈ నేర ఆదాయం రూ.100 కోట్ల లంచం మాత్రమే కాదు. లంచం చెల్లించే వారి ద్వారా వచ్చే లాభాలు కూడా ఉన్నాయి. అవన్నీ కలిపితే రూ.600 కోట్లకు పైమాటే. రూ.45 కోట్లు హవాలా ద్వారా గోవాకు బదిలీ చేశారు’ అని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్