"ఆ ఆశతోనే బతుకుతున్నా"

85చూసినవారు
"ఆ ఆశతోనే బతుకుతున్నా"
"గణేశుని ప్రేమ కథ"
హాయ్ నా పేరు గణేష్! స్వస్థలం నందిపేట్. నా ప్రేయసిని నేను నిజామాబాద్ లో డేటా ఎంట్రీ నేర్చుకునే టైంలో కలిశాను. స్నేహం ఏర్పడింది. అలా మంచి స్నేహితులం అయ్యాము. అలా 6 నెలలు గడిచిన తరువాత తనకి నా ప్రేమ గురించి చెప్పాను. కానీ తనకి ప్రేమ నచ్చదని, ఎవరిని ప్రేమించనని, ఇంట్లో వాళ్ళు చుసిన సంబంధం చేసుకుంటానని చెప్పింది. కానీ నేను మాత్రం ఒకటే చెప్పా. "నీ కోసం ఎప్పటి వరకైనా వేచి ఉంటా" అని. ఇలా జరిగిన 20 రోజులకి తనూ వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నానని తన స్నేహితులకు చెప్పింది. వాళ్ళు నాకు ఆ అమ్మాయిని వదిలేయ్.. తను వేరేవాళ్ళని ప్రేమిస్తోందని చెప్పారు. కానీ నాకు తనంటే చాలా ఇష్టం.. ఎలా వదిలేయగలను! అయితే మళ్ళీ నేను ఆలోచించి 'తన సంతోషమే నా సంతోషం' అని అనుకున్నాను. కానీ ప్రాణం అనుకున్న తాను దూరమయ్యిందని ఏడవాలా? ఏమీ అర్థం కావడం లేదు. మనకి అత్యంత ఇష్టమైన వ్యక్తులు.. ఏదో రూపంలో మన జీవితంలోకి మళ్లీ వస్తారని చెబుతుంటారు. నేనూ అదే ఆశతో బతుకుతున్నా. - గణేష్

సంబంధిత పోస్ట్