అక్టోబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు?

56చూసినవారు
అక్టోబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు?
తెలంగాణలో సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక అక్టోబరులో ఈ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియగానే బీసీ రిజర్వేషన్లపై చర్చించనున్నట్లు వినిపిస్తోంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా 3 ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్