నవ గ్రహాల్లో శని గ్రహాన్ని న్యాయాధిపతిగా పరగణిస్తారు. ఆయన అనుగ్రహం ఉంటే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభం, మకర రాశులకు శని దేవుడు అధిపతి. అందుకే ఈ రాశి వారు ఏ రంగంలోనైనా సులభంగా విజయం సాధిస్తారు. క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా ముందుకు అడుగులేసి కష్టానికి తగని ఫలితాలు పొందుతారు. అలాగే తుల రాశి వారికి శని ఏడో స్థానంలో ఉంటే వారు ఆనందంతో జీవిస్తారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.