ప్రేమ వివాహం చేసుకున్న జంటపై అమ్మాయి బంధువుల దాడి

567చూసినవారు
ప్రేమ వివాహం చేసుకున్న జంటపై అమ్మాయి బంధువుల దాడి
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంటపై దాడి జరిగింది. ఎస్సై కిరణ్ కుమార్ వివరాల ప్రకారం.. సాతారానికి చెందిన అనిల్ అదే గ్రామానికి చెందిన రమ్యను ఇటీవల ప్రేమ వివాహం చేసుకొని వేరే గ్రామంలో నివసిస్తున్నాడు. గురువారం గ్రామానికి తిరిగి రావడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు అనిల్ ఇంట్లోకి చొరబడి దాడి చేశారు. అనంతరం అమ్మాయిని తీసుకెళ్లారు. దీంతో బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్