లంచ్‌ బ్రేక్‌.. 5 వికెట్లను కోల్పోయిన ఆసీస్

63చూసినవారు
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న ఐదో టెస్టు రసవత్తరంగా మారుతోంది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ రెండో రోజు లంచ్‌ బ్రేక్‌ సమయానికి ఐదు వికెట్లను కోల్పోయి 101 పరుగులు చేసింది. క్రీజ్‌లో వెబ్‌స్టర్ (28*), అలెక్స్ కేరీ (4*) ఉన్నారు. స్టీవ్ స్మిత్ (33), సామ్ కొన్‌స్టాస్ (23) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో బుమ్రా 2, సిరాజ్ 2, ప్రసిధ్ ఒక వికెట్ పడగొట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్