దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం బలిదుపల్లి గ్రామ సమీపంలో స్నేహ చికెన్ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలను బుధవారం బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ పరిశీలించారు. చికెన్ వ్యర్థాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతున్నదని, కంపెనీ నుంచి వస్తున్న కంపుతో ఊపిరి తీసుకోలేక శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో తిరుపతయ్య యాదవ్, వెంకటన్నగౌడ్, అంజన్న యాదవ్, రమేష్ సాగర్, మల్లేష్ పాల్గొన్నారు.