లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం దేవరకద్ర నియోజకవర్గం కేంద్రంలో డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పేద గిరిజన, దళిత రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.