మహబూబ్ నగర్ జిల్లాలో శనివారం ఉదయం భారీగా మంచు కురుస్తోంది. దీంతో పాలమూరు మరో ఊటీని తలపిస్తోందంటున్నారు. మంచుకు తోడుగా చలి ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం పూట పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, పొలాలకు వెళ్లే రైతులు మంచుతో అవస్థలు పడుతున్నారు. కాగా చలితో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని రైతులు పేర్కొంటున్నారు.