AP: యాంటిరెట్రో వైరల్ థెరపీ కేంద్రాల్లో 6 నెలలు చికిత్స పొందిన HIV బాధితులకు ప్రభుత్వం నెలకు రూ.4 వేల పెన్షన్ అందజేస్తుందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో కొన్ని ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ (ICTC) వాహనాలను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. మారుమూల ప్రాంతాల్లో సేవలందించడం కోసం వీటిని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఏపీలో 2.22 లక్షల మంది HIV బాధితులున్నారు.