మహబూబ్ నగర్ జిల్లా పాలిటెక్నిక్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ లో శనివారం వీడియో రికార్డు కలకలం రేపిన విషయం తెలిసిందే. కాగా హాస్టల్లోని బాత్రూం వద్ద ఓ యువకుడు వీడియో రికార్డ్ చేసినట్లు విద్యార్థులు గమనించి ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. కళాశాలకు పోలీసులు చేరుకుని సిద్ధార్థ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. కళాశాల దగ్గర పలువిద్యార్థి సంఘాల నేతలు విద్యార్థులతో కలిసి ఆందోళన చేపట్టారు.