స్త్రీల విద్య, అభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి ఫూలే అని కలెక్టర్ విజయేంద్రబోయి అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో ఆమె చిత్రపటానికి కలెక్టర్ పూల మాలవేసి నివాళులర్పించారు. కుల మత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి సావిత్రిబాయిపూలే అని కొనియాడారు. అనంతరం విద్యా రంగంలో విస్తృత సేవలందించిన నలుగురు మహిళా టీచర్లను కలెక్టర్ శాలువాలతో సన్మానించారు.