దేవరకద్ర నియోజకవర్గం శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు నవంబర్ 2 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి జాతర మైదానంలో వివిధ శాఖల అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. జాతరలో ఏర్పాట్లపై అధికారులు అలసత్వం వద్దని తెలిపారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.