గద్వాల: బైకును బండరాయి తో ధ్వంసం చేసిన ఘనుడు

73చూసినవారు
జిల్లా కేంద్రమైన గద్వాలలోని పాత కలెక్టరేట్ కార్యాలయం ముందు ఓ యువకుడు బైకును బండరాయితో ధ్వంసం చేశాడు. బుధవారం సాయంత్రం అటుగా వెళుతున్న వారు ఈ దృశ్యాన్ని సెల్ ఫోన్ లో చిత్రికరించారు. ప్రయాణికులు అందరూ చూస్తుండగానే సుమారు నాలుగు నిమిషాల పాటు తన ద్విచక్ర వాహనాన్ని పెద్దపెద్ద బండరాళ్లతో విరగొట్టాడు. అతన్ని ఎవరూ ఆపలేకపోయారు. ఏం జరిగిందో ఏమో, ఎందుకిలా చేశాడో, అని పట్టణవాసులు పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్