గద్వాల: గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తా.. చైర్మన్ శ్రీనివాస్

67చూసినవారు
గద్వాల: గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తా.. చైర్మన్ శ్రీనివాస్
గద్వాల జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని గ్రంథాలయాల సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు గురువారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో ఛాంబర్లో జిల్లాలోని సిబ్బందితో ఆయన ప్రత్యేక సమావేశం అయ్యారు. ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించి గ్రంథాలయాలు తెరిచి ఉంచాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. జిల్లాలో 9 శాఖ గ్రంథాలయాలు, నాలుగు గ్రామీణ గ్రంథాలయాలు ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్