జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని సిటీపాడు గ్రామంలో ఓ మోస్తారు వర్షం కురిసింది. గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మూడు నెలలుగా ఉక్కపోతతో అలమటించిన జనం వర్షంతో ఉపశమనం చెందారు. సేద్యం చేసుకోవడానికి వర్షం బాగా ఉపయోగపడుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.