బీరు బాటిల్లో బల్లి అవశేషాలు

78చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా ధారూరు మండలంలో బీరు బాటిల్లో బల్లి అవశేషాలు ఉండటం కలకలం రేపుతోంది. కేరెల్లి గ్రామానికి చెందిన ఇద్దరు స్థానిక విజయదుర్గా వైన్ షాపులో రూ. 4వేల విలువైన మద్యం కొనుగోలు చేశారు. బడ్వైజర్ బీరు సీసాలో బల్లి అవశేషాలు ఉన్నట్లు గుర్తించి వెంటనే ఫిర్యాదు చేశారు. షాపు నిర్వాహకులేమో తమకేం సంబంధం లేదని బదులివ్వడంతో కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్