జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామంలో ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ బుధవారం రాత్రి 10. 30 గంటల ప్రాంతంలో నిర్వహించిన ప్రచారంలో జనం నిరాజనం పలికారు. గ్రామంలోని కూడలి వద్ద ఏర్పాటుచేసిన సమావేశానికి మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఆయన కోరారు.