గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే

50చూసినవారు
గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే
గట్టు మండల పరిధిలోని చిన్నోనిపల్లి, నాగర్ దొడ్డి గ్రామాల్లో భారీ వర్షాల కారణంగా వరద నీరు ఇళ్లలోకి చేరింది. ఈ విషయంపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మంగళవారం రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఏర్పాటుచేసిన ప్రత్యామ్నాయ వసతి గృహాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, గృహాల పరిస్థితులను పరిశీలించాలని మంత్రిని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్