చిన్నోనిపల్లె ముంపు గ్రామాన్ని సందర్శించిన ఆర్ డి ఓ

64చూసినవారు
చిన్నోనిపల్లె ముంపు గ్రామాన్ని సందర్శించిన ఆర్ డి ఓ
గట్టు మండలంలోని చిన్నోనిపల్లె గ్రామాన్ని శనివారం ఆర్ డి ఓ, తహసీల్దార్ సందర్శించారు. గ్రామాన్ని వరద ముంపు నుంచి రక్షించేందుకు నీరు బయటకు వెళ్లే కాలువ పనులు ప్రారంభించగా, లింగాపురం గ్రామానికి చెందిన కొందరు రైతులు ఈ పనులకు అడ్డంకులు సృష్టించారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో, ఆర్ డి ఓ స్వయంగా వచ్చి కాలువ పనులను పరిశీలించారు. అధికారులు తక్షణమే స్పందించి పనులు పున: ప్రారంభించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్