మల్దకల్‌లోని ఆదిశిలక్షేత్రం శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ హుండీ ఆదాయం రూ. 18, 41, 990గా లభించినట్లు దేవాలయ చైర్మన్ ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి గురువారం తెలిపారు. దేవాలయంలో జరిగిన హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని దేవాదాయ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సభ్యులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.