మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో కాన్పులు చేసినట్లు మంగళవారం సూపరింటెండెంట్ సంపత్ కుమార్ తెలిపారు. 24 గంటల్లో 41 కాన్పులు జరిగాయని పేర్కొన్నారు. 41 కాన్పులలో 10 నార్మల్, 31 సిజేరియన్ డెలివరీలు అయినట్లు వివరించారు. ప్రసవాలు నిర్వహించిన ఆసుపత్రి వైద్య బృందాన్ని సూపరింటెండెంట్ అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందిస్తున్నామని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.