ఒకే ఈతలో ఐదు పిల్లలకు జన్మనిచ్చిన మేక

55చూసినవారు
ఒకే ఈతలో ఐదు పిల్లలకు జన్మనిచ్చిన మేక
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వెల్దండ మండలం గుండాలలో ఒకే ఈతలో ఐదు మేక పిల్లలకు మేక జన్మనిచ్చింది. గ్రామానికి చెందిన లింగమయ్య అనే రైతుకు సంబంధించిన మేక ఐదు పిల్లలకు జన్మనివ్వడమే కాకుండా జన్మించిన ఐదు మేకపిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు రైతు తెలిపారు. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయని, ఇలాంటి అరుదైన ఘటనలు జరిగినప్పుడు వాటికి పాలు సరిపోక చనిపోయే అవకాశం ఉందని బుధవారం పశువైద్యాధికారి శ్యాంసుందర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్