సైబర్ నేరానికి గురైతే 1930కి డయల్ చేయాలని బాలానగర్ ఎస్ఐ తిరుపాజీ తెలిపారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా పోలీసు సురక్ష కళా బృందం ఆధ్వర్యంలో బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్ల ప్రలోభాలకు లొంగకూడదని అన్నారు. బాల్యవివాహాల వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతాయని, అలాంటి పెళ్లిళ్లు ఉంటే 1098కి ఫోన్ చేయాలన్నారు.