ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ఆగం చేసింది: డీకే అరుణ

65చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేర్లు చెప్పుకొని తెలంగాణ ప్రజలను ఆగం చేసిందని మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు. ఆదివారం జడ్చర్ల నియోజకవర్గం ఉర్కొండ మండల పరిధిలోని మాదారంలో ఆమె ప్రచారం నిర్వహించారు. ప్రజలను నమ్మించి ముంచినందుకు ఈ ఎన్నికలలో వారికి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్