మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అమిస్తాపూర్ లో నిర్వహించిన రైతు పండుగ సభకు శనివారం సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించి, అధునాతన సాంకేతికతో తయారైన ట్రాక్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి నడిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, తదితరులు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.