మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో మంగళవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి పట్టణ అఖిల భారత యాదవ సంఘం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. యాదవులకు అండగా ఉంటానని, యాదవులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. యాదవులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు, యాదవులు రమేష్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.