జడ్చర్ల: స్కూటీలోకి దూరిన నాగుపాము

80చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని జాతీయ రహదారి పక్కన ఓ హోటల్ వద్ద నిలిపి ఉంచిన ఎలక్ట్రిక్ స్కూటీలోకి నాగుపాము దూరింది. గమనించిన యజమాని వెంటనే వృక్షశాస్త్ర అధ్యాపకులు డా. సదాశివయ్య కు సమాచారం అందించారు. శిష్యులైన నవనీత్ రెడ్డి, రవీందర్ నాయక్ దాదాపు గంట సేపు శ్రమించి స్కూటీలోంచి పామును సురక్షితంగా బయటికి తీశారు. ఈ సందర్భంగా శనివారం పట్టణ ప్రజలు డా. సదాశివయ్య, శిష్యులను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్