జడ్చర్ల మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన పోలే శ్రీకాంత్ భార్య పోలే హరిత మరణించింది. ఈ విషయం తెలుసుకున్న యువనేత ఏ శీను గౌడ్ శుక్రవారం మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.